క్రీడాకారులను ఫ్యాన్స్ పిచ్చిగా ఆరాధిస్తారు. వాళ్లతో ఒక్క ఫొటో దిగినా చాలని ఆరాటపడుతుంటారు. కొందరు ఏకంగా ప్రేమిస్తున్నామని వెంటపడుతుంటారు. అయితే, వాళ్ల ప్రేమ ఫలిస్తుందని చెప్పలేం. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ గర్బిన్ ముగురుజ లైఫ్ లో అదే జరిగింది. సెల్ఫీ అని వచ్చిన అభిమానికి ఏకంగా పెళ్లి చేసుకోబోతోంది.
2021లో యూఎస్ ఓపెన్ ఆడుతున్న టైంలో ఆర్ధర్ బోర్జెస్ అనే అభిమాని సెల్ఫీ తీసుకుని విషెష్ చెప్పాడు. ఆ టైంలో ఆర్ధర్ ను చూసిన మురుగుజ.. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అనుకుందట. అతని గురించి తెలుసుకోగా.. ఫ్యాషన్ రంగంలో పనిచేస్తున్నాడని తెలిసింది. అంతే.. మళ్లీ ఈ ఇద్దరు కలువగా.. నెంబర్స్ ఎక్స్ ఛెంజ్ చేసుకున్నారు. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది.
పరిచయం అయిన రెండేళ్ల తర్వాత ఆర్ధర్ ప్రపోజ్ చేశాడు. దాంతో సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న మురుగుజ.. ఏడుస్తూనే ఓకే చెప్పింది. తాజాగా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ముగురుజ ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది.