Volodymyr Zelenskyy : అదే అయితే..మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్‌స్కీ

Update: 2024-01-29 05:04 GMT

రష్యాతో జరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని ఈ నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని వెల్లడించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు కూడా తెలుసని చెప్పారు. నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది ఖచ్చితంగా మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయన జర్మనీ పర్యటనలో ఉన్నారు.

జర్మనీ నుంచి టారస్‌ క్రూజ్‌ మిసైల్స్ అందకపోవటంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని వ్యాఖ్యానించారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. ఒక్క జర్మనీనే కాకుండా పలు దేశాల పరిస్థితి కూడా అలాగే ఉందని వివరించారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైనప్పుడు జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదన్నారు. ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఉక్రెయిన్‌ కోసం ఇప్పుడు జర్మనీ పెద్ద ఎత్తున నిధులను సమకూర్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం జరుగుతున్నప్పుడు ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలను పంపుతాయని జెలెన్ స్కీ చెప్పారు.




Tags:    

Similar News