RS 90 Lakh Bill: ఒక్క భోజనానికి ఏకంగా రూ. 90 లక్షల బిల్.. ఎక్కడో తెలుసా?

Byline :  Veerendra Prasad
Update: 2024-01-30 09:54 GMT

సాధారణంగా ఏదైనా హోటల్‌కి భోజనం కోసం వెళ్లినప్పుడు.. జీఎస్టీతో కలపి ఫుల్ మీల్స్ ధర మహా అయితే ఒక రూ.500 నుంచి రూ.1000 వరకూ ఉంటుంది. అదే ఏదైనా స్టార్ హోటల్‌లో అయితే మీల్స్, ఐస్‌క్రీమ్, ఇతర స్పెషల్ ఐటమ్స్ అన్నీ కలిపి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉండొచ్చేమో. కానీ ఓ హోటల్‌లో మాత్రం ఒక్క పూట భోజనానికే ఏకంగా రూ. 90 లక్షల బిల్ అయింది. ఇందుకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశాడు. దానికి ఏకంగా రూ. 90 లక్షల బిల్లు అయిందట. ఈ విషయాన్ని సాల్ట్ బే అని ప్రసిద్ధి చెందిన టర్కిష్ చెఫ్ నుస్రెట్ గోక్సే తన ఇన్ స్టా లో.. డబ్బులు వస్తాయి.. పోతాయి అంటూ ఈ బిల్లును పోస్ట్ చేశాడు. గత వారం తన దుబాయ్ రెస్టారెంట్‌లో ఒక్క భోజనం కోసం మొత్తం $108,500 (సుమారు రూ. 90,23,028) తీసుకున్నట్లు బిల్లును షేర్ చేశాడు.

సదరు వ్యక్తి ఆర్డర్ చేసిన భోజనంలో బీఫ్ కార్పాసియో, ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్, బక్లావా మరియు ఫ్రూట్ ఉన్నాయి. ఇక డ్రింక్ ల విషయానికొస్తే.. నాలుగు పోర్న్ స్టార్ మార్టినీలు ($130), రెండు బాటిల్స్ చాటే పెట్రస్ 2009 ($53,900), ఒక బాటిల్ పెట్రస్ 2011 ($17,700), స్పెషల్ లూయిస్ XIII కాగ్నాక్ నీట్ ($7,500) ను ఆర్డర్ చేశాడు. వీటన్నటితో పాటు టిప్పుగా భోజనం తర్వాత $24,500 చెల్లించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఒక్క భోజనానికి రూ. 90 లక్షలు ఏంటని ఫైర్ అవుతున్నారు. అలాగే వాటితో ఓ పెళ్లి కూడా చేయోచ్చని అంటున్నారు. "మిలియన్ల మంది ప్రజలు ఓ పక్క ఆకలితో బాధపడుతుంటుంటే.. ఇలా చేయటం సిగ్గుచేటు" అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతంత రేట్లు ఉన్నందుకు ఆ రెస్టారెంట్‌ను కూడా చాలామంది దుయ్యబట్టారు.

Tags:    

Similar News