నిండా మునిగిన దుబాయ్.. తేలిపోతున్న కార్లు..

Update: 2023-11-18 11:19 GMT

ఎడారి నగరం కుండపోత వానలతో అతలాకుతలమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నడు. అంతర్జాతీయ వాణిజ్య నగరం దుబాయ్ వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలగడంతో జనం ఇళ్లకే పరిమితయ్యారు. విమానాల సర్వీసులపైనా ప్రభావం పడింది.

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల దుబాయ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు స్తంభించాయి. యూఏఈ ప్రభుత్వం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అవసరముంటేనే బయటకి రావాలని బీచ్‌లకు వెళ్లొద్దని సూచించింది. సెల్లార్లు, కింది అంతస్తులు నీట మునిగిపోవడంతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. వరదల వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఖరీదైన కార్లు కొట్టుకుపోతూ కనిపించాచయి. ఓ వ్యక్తి పడవ నడుపుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. దుబాయ్‌లో ఇలాంటి దృశ్యాలు ఎన్నడూ చూడలేని, పర్యావరణ మార్పులకు ఇది సంకేతం కావొచ్చని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News