రికార్డ్.. 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ

By :  Bharath
Update: 2023-12-02 08:00 GMT

మారుతున్న కాలంలో 40 ఏళ్లు నిండిన మహిళలు పిల్లల్ని కనడం కాస్త కష్టమే. ఇప్పుడున్న కల్తీ ఫుడ్, హ్యాబిట్స్ అలాంటివి మరీ. అందుకే ఆ కాలం మనుషులే బెటర్. దృడంగా ఉండేవారు అని అంటుంటారు. అది మరోసారి నిజం చేసింది ఉగాండాకు చెందిన 70 ఏళ్ల మహిళ. ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళకు ప్రస్తుతం 70 ఏళ్లు. సంతానోత్పత్తుల ద్వారా ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది. కంపాలా నగరానికి చెందిన సఫీనా నముక్వాయా బుధవారం సిజేరియన్ ద్వారా ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితి బాగుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇన్ విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా సఫీనా నముక్వాయా సంతాన భాగ్యం పొందినట్లు డాక్టర్లు తెలిపారు. సఫీనా నముక్వాయా 2020లోనూ ఈ పద్దతి ద్వారా ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికా దేశాల్లోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డుకెక్కింది.

Tags:    

Similar News