మాస్కో ఎయిర్పోర్టుపై డ్రోన్ల దాడి.. వాళ్ల పనే అంటున్న రష్యా

Update: 2023-07-30 05:17 GMT

రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్ల దాడి జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొనగా తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు చెప్పింది. డ్రోన్ల దాడిలో ఎయిర్ పోర్టులోని రెండు బిల్డింగులు దెబ్బతిన్నాయి.

డ్రోన్ దాడిని ఉగ్రదాడిగా అభివర్ణించిన రష్యా దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించింది. ‘‘జులై 30న ఉదయం కీవ్‌ పాలకులు డ్రోన్లతో ఉగ్రదాడికి ప్రయత్నించారు. దానిని భగ్నం చేశాం. ఉక్రెయిన్‌ కు చెందిన ఒక యూఏవీని కూల్చివేశాం. మరో రెండు డ్రోన్లు కూడా తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫెర్‌ వ్యవస్థ దెబ్బకు నియంత్రణ కోల్పోయి కూలిపోయాయి అని రక్షణశాఖ ప్రకటించింది. ఈ దాడిలో రెండు ఆఫీస్‌ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని రష్యా మేయర్‌ సెర్గీ సోబియన్‌ చెప్పారు.




 


దేశ సరిహద్దుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కోపై డ్రోన్‌ దాడి జరగడంపై ఆ దేశ సైన్యం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పింది. డ్రోన్ ఘటన అనంతరం మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కాసేపు మూసివేశారు. విమానాశ్రయానికి వచ్చే విమానాలను దారి మళ్లించారు. గంట తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.


Tags:    

Similar News