ఉక్రెయిన్ ఊహించిందే జరిగింది. . ఆ దేశంలో అత్యంత కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్టను పేల్చివేశారు. మంగళవారం తెల్లవారుజామున నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్..పేలుడు ధాటికి ధ్వంసమైంది. దీంతో వేలాది మంది ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారు. డ్నిప్రో నది వెంబడి గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలవైపు భారీ వరద దూసుకొస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆప్రమత్తమైన ఉక్రెయిన్ ప్రభుత్వం..లోతట్టు ప్రాంతాల ప్రజలను వేగంగా ఖాలీ చేయిస్తున్నారు. . మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి గ్రామాలను ఖాళీ చేయాలని సూచించారు.
డ్యామ్ పేల్చివేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జాతీయ భద్రత, రక్షణ మండలితో అత్యవసర సమావేశం నిర్వహించారు. నోవా కఖోవ్కా ఆనకట్టపై దాడి రష్యా పనే అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ముందునుంచే ఉక్రెయిన్ ఈ ఉక్రెయిన్ ఈ విషయాన్ని పదేపదే హెచ్చరించింంది. దక్షిణ ప్రాంతంలోని భూభాగాన్ని తిరిగి పొందడాన్ని రష్యా ఈ ఆనకట్టను పేల్చేయొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. ఊహించినట్టుగానే తాజాగా నోవా కఖోవ్కా ఆనకట్ట పేలుడుకు గురైంది. అయితే రష్యా మాత్రం తాము పేల్చలేదని వివరణ ఇచ్చింది. ఉగ్రవాదులు పేల్చి ఉండొచ్చని ప్రకటించింది.
ఖోవ్కా ఆనకట్ట 30 మీటర్ల ఎత్తు.. కొన్ని వందల మీటర్ల పొడవు ఉంది. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది.