గల్ఫ్‌లో యుద్ధమేఘాలు! 3వేల మంది సైనికులను దింపిన అమెరికా..

Update: 2023-08-07 17:18 GMT

గల్ఫ్ సింధుశాఖలో అలజడి రేగింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ నౌకల భద్రత కోసమంటూ అగ్రరాజ్యం ఎర్ర సముద్రంలో వేలమంది సైనికులను దింపుతోంది. రెండు యుద్ధనౌకల్లో 3 వేలమంది సైనికులు అక్కడ మోహరించామని అమెరికా నేవీ తెలిపింది.




 


అమెరికాకు చెందిన ఓ భారీ వాణిజ్య నౌకను ఇరాన్ అదుపులోకి తీసుకోవడంతో వివాదం మొదలైంది. ఇరాన్ తమ నౌకలను ఏవో సాకులు చెప్పి నిర్బంధిస్తోందని, వాటిని కాపాడుకోవడాని రంగంలోకి దిగామని అమెరికా చెబుతోంది. ఓ నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికి వరకు 20 నౌకలను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఆరోపణ. అయితే నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి కాబట్టే అదుపులోకి తీసుకుంటున్నామని ఇరాన్ చెబుతోంది. గత నెల 5న ఒమన్‌ వెళ్తున్న తమ నౌకలను ఇరాన్ నేవీ అడ్డుకుందని ఆమెరికా ఆరోపిస్తోంది. అమెరికాకు చెందిన ‘బహమినియన్ రిచ్మండ్’ నౌక తమ దేశపు నౌకను ఢీకొట్టడంతో ఐదుగురు గాయపడ్డారని, అందుకే స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ చెబుతోంది. అమెరికాను దీటుగా ఎదుర్కోవడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా తీరంలో పెద్దసంఖ్యలో బలగాలను మోహరిస్తోంది. అమెరికాకు ఇజ్రాయెల్ కూడా వత్తాసు పలకడంతో గల్ఫ్‌లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.


Tags:    

Similar News