గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
గణేశ్ మండపం వద్ద అప్పటి వరకు హుషారుగా డ్యాన్స్ చేస్తున్న ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏం జరిగిందో అని కంగారుపడి అక్కడే ఉన్న స్థానికులంతా హుటాహుటిన ఆస్పత్రి తరలించగా.. డాక్టర్లు చెప్పిన చేదు వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మారుతి నగర్‌లో రాత్రి వినాయకుని మండపం ముందు ప్రసాద్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చుట్టు పక్కల ఉన్న జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అలా ప్రసాద్ పడిపోవడంతో అక్కడి వారు విస్తుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడి ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అతడు గుండెపోటుతో కన్నుమూసినట్లు గుర్తించారు. అప్పటి వరకు తమ ముందు డ్యాన్స్ చేసి.. ఎంతో సందడి చేసిన ప్రసాద్.. విగత జీవిగా మారడాన్ని స్నేహితులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. యువకుడి మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ప్రసాద్ డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత గుండెపోటుతో కిందపడిపోడం అంతా స్థానికులు వీడియో తీశారు.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు పలు చోట్ల జరిగాయి.
గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023
శ్రీ సత్యసాయి జిల్లా - ధర్మవరంలో
ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. pic.twitter.com/RUqf1mzRMR
ఇటీవల గుండె పోటు కారణంగా మరణించే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి హర్ట్ స్ట్రోక్ కారణంగా అంతలోనే విగతజీవిగా మారుతున్నాడు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఒకప్పుడు గుండెపోటు అంటే బాగా వయస్సు మీద పడే వారికి మాత్రమే వచ్చేది. కానీ నేటికాలంలో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా..10నెలల పిల్లవాడి నుంచి పండు ముసలి వారి వరకు అందరికి వస్తుంది.