చెట్టు తొర్రలే ఇల్లు..పండ్లే ఆహారం..సాహసవీరులు ఈ చిన్నారులు

Update: 2023-06-13 04:18 GMT

ఎంతో ప్రమాదకరమైన అమెజాన్‌ కారడవిలో వినాన ప్రమాదం కారణంగా చిక్కుకుని 40 రోజుల తరువాత సురక్షితంగా బయటపడ్డారు నలుగురు చిన్నారులు. తమ జీవితంలో మొదటి సాహస యాత్రను చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 11 నెలల శిశువు దగ్గరి నుంచి 13 ఏళ్ల వరకు ఉన్న ఈ చిన్నారులు ఈ 40 రోజులు ఎలా జీవించారన్నదే ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తున్న విషయం. ప్రస్తుతం ఈ నలుగురు చిన్నారులు కొలంబియాలోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు వారికి ద్రవరూపంలోనే ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నారుల బంధువులు వారిని కలిసినప్పుడు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.




 బాధితుల్లో ఇద్దరు చిన్నారుల తండ్రి మాన్యుయ్‌ రానోక్‌ మీడియాతో మాట్లాడారు.." మే 1న అమెజాన్ అడవుల్లో విమానం కూలింది. ఆ ప్రమాదం తరువాత నాలుగు రోజుల పాటు తన తల్లి బతికే ఉందని నా 13 ఏళ్ల కూతురు లెస్లీ జాకొబాంబైర్‌ చెప్పింది. వెంటనే ఈ ప్రమాదకర ప్రదేశాన్ని వీడాలని తన తల్లి చనిపోయే ముందు లెస్లీతో చెప్పింది. అప్పటి నుంచి లెస్లీనే ఈ చిన్నారులకు మార్గదర్శిగా ఉంది" అని చెప్పారు.





పిల్లల మావయ్య ఫిడెన్సియో మాట్లాడుతూ.. " పిల్లలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన అడవిలో విష సర్పాలు, ప్రమాదకరమైన జంతువులు, దోమల నుంచి తప్పించుకునేందుకు వారు చెట్టు తొర్రల్లో దాక్కున్నారు. ఈ విషయాలను పిల్లలు చెప్పారు. మొదట ఆహారంగా తమతో పాటు మిగిలి ఉన్న కసావా పిండిని కొంత కాలం తిన్నారు. అదే విధంగా అడవిలో దొరికే పండ్లు వారి ఆకలిని తీర్చాయి. ఈ విషయాలను చెబుతుంటే కంట్లో నీళ్లు తిరిగాయి. చిన్నారులు సురక్షితంగా తిరిగిరావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు తమకు ఆడుకోవాలని అనిపిస్తుందని చెబుతున్నారు"అని పిల్లల అంకుల్ చెప్పారు.





40 రోజుల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ చేసిన నికోలస్ మీడియాతో మాట్లాడారు. పిల్లల్ని కలిసిన మొదటి క్షణాలను ఆయన మీడియాకు వివరించారు. " మొదట లెస్లీ ఓ చిన్నారిని ఎత్తుకుని మా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పాప మొదటగా నాకు ఆకలి వేస్తోందని చెప్పింది. మిగిలిన ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకుని ఉన్నాడు. మరొకడు లేచి అమ్మ చనిపోయిందని చెప్పాడు. వారి మాటలు విని చలించిపోయాము. పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేశాము. మేము మీ స్నేహితలమని, మీ కుటుంబ సభ్యులే మమ్మల్ని ఇక్కడికి పంపించారని చెప్పాము"అని నికొలాస్ తెలిపారు.

ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు‘ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు. 

Tags:    

Similar News