అదృష్టం అంటే ఆమెదే.. ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన రూ.91లక్షల లాటరీ టికెట్..

Byline :  saichand
Update: 2024-01-06 08:35 GMT

నిజంగా అదృష్టమంటే ఈమెదే.. ఎప్పుడో లాటరీని కొని దాన్ని డెస్క్‌లో పెట్టి మరిచిపోయిన ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన ఓ మహిళ క్రిస్టమస్ సందర్భంగా ఇంటిని శుభ్రం చేస్తుండగా.. రెండేళ్ల క్రితం డెస్క్‌లో పెట్టి మరిచిపోయిన లాటరీ కనిపించింది. ఆ లాటరీని ఆమె ఫిబ్రవరి 2021లో లీగల్ లాటరీలో $44 ఖర్చు చేసి సూపర్ 6 గెమ్ ఆడి దాన్ని గెలుచుకుంది. తర్వాత ఆ లాటరీని ఆమె డెస్క్ డ్రాయర్‌లో ఉంచి దాని గురించి మరచిపోయింది. 2023 క్రిస్టమస్ వేడుకల కోసం ఆమె ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో ఆ టిక్కెట్ కనిపించింది. తర్వాత తన లాటరీ ప్రైజ్ మనీ గెలిచిందని తెలిసి ఆశ్చర్యపోయింది. సుమారు $110,000 (రూ. 91 లక్షలు) గెలుచుకున్నట్లు తెలుసుకుని షాక్‌ అయింది.

లాటరీ టిక్కెట్‌ క్లెయిమ్ చేయడానికి ఇంకా సమయం ఉందని గమనించిన మహిళ లాటరీ నిర్వాహకులను సంప్రదించింది. ధృవీకరణ కోసం టికెట్‌ను సమర్పించనప్పుడు దాన్ని చూపిన లాటరీ అధికారి ఆశ్చర్యపోయాడని తెలిపింది. ఆ లాటరీ వాలీడ్‌‌ డిసెంబర్ 31, 2024 వరకు ఉండడంతో నిర్వాహకులు ఆమెకు ప్రైజ్ మనీని అందజేశారు. దాన్ని ఆమె తన హాలీడే ట్రిప్స్ కోసం ఉపయోగిస్తానని తెలిపారు. కొన్ని నెలల క్రితం మసాచుసెట్స్ వ్యక్తి ఈ విధంగానే తన టిక్కెట్‌పై $1 మిలియన్ లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. మొత్తం విలువ దాని $660,000. కానీ ఆ వ్యక్తి దాన్ని క్లెయిమ్ చేయలేదని లాటరీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News