‘ఏలియన్ల’కు స్కానింగ్ పూర్తి... ఫలితాల్లో సంచలన విషయాలు...

Update: 2023-09-20 12:10 GMT

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ‘గ్రహాంతర వాసుల’ గుట్టు వీడిపోనుంది. వాటి నిర్మాణం గురించి వ్యక్తమైన అనుమానాలు తొలగిపోయాయి. కొందరు అనుమానించినట్లు అవి ట్యాంపర్డ్ స్కెలటిన్లు కావని, పూర్తిగా ఉన్న ఎముకలతో కూడిన అస్థిపంజరాలేనని తేలింది. కొన్ని ఎముకలను పోగుచేసి ఏవో జంతువుల అవయవాలు అతికించారని అనుమానాలు రావడంతో మెక్సికో ప్రభుత్వం వాటిని స్కానింగ్ చేయించింది. పరీక్షలు నిర్వహంచిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు.

మెక్సికో సిటీలోని లేబొరేటరీలో మంగళవారం వైద్యులు అత్యాధునిక టెక్నాలజీతో వీటికి ఎక్స్-రే, సీటీ స్కాన్‌ చేశారు. అవి ఏ రకం జీవులవో ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాకపోయినా అవి కృత్రిమంగా తయారు చేసిన పీనుగలు మాత్రం కావని నావల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ డి జీసస్ జూల్స్ బెనిటెజ్ చెప్పారు. ‘‘ఇవి మానవేతర జీవులు అన్న నా విశ్లేషణ రుజువైంది. డార్విన్ మనవ పరిణామక్రమ సిద్ధాంతానికి సంబంధించిన బయలాజీ, టక్సానమీకి ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి జీవులను విశ్లేషించడంలో చాలా సమస్యలు ఉన్నాయి.’’ అని అన్నారు.

కాగా, అస్థిపంజరాల చేతులకు మూడే వేళ్లు ఉండడం, పుర్రెలు మాత్రం సినిమాల్లోని ఏలియన్ల పుర్రెల్లా పెద్దగా ఉండడంతో గ్రహాంతర వాసులు కావొచ్చని భావిస్తున్నారు. జైమ్ మౌజాన్ అనే 70 ఏళ్ల జర్నలిస్టు వీటిని పెరూ నుంచి తీసుకొచ్చి మెక్సికో పార్లమెంటులో ప్రదర్శించడం తెలిసిందే. ఇవి వెయ్యేళ్ల కిందటివని, వీటి డీఎన్ఏలో మూడింట ఒక శాతం మానవేతరమైందని అన్నాడు. అయితే గతంలోనూ అతడు ఇలాంటి అస్థిపంజరాన్ని పట్టుకురావడం, అది కాస్తా ఓ చిన్నారి కళేబరమని తేలడంతో కొందరు తాజా ‘ఏలియన్లు’ కూడా మనషులవే అని భావిస్తున్నారు.

Full View

Tags:    

Similar News