బ్రేకప్ పెయిన్.. చనిపోవాలని ఏం చేశాడంటే..?

Update: 2023-07-31 17:02 GMT

పిచ్చి ప్రేమ వినాశనానికి దారి తీస్తుంది అని ఊరికే అనలేదు. ఈ మధ్య ఆ మాటలు చాలా చోట్ల నిజం అయ్యాయి కూడా. బ్రేకప్ చెప్పిందని ప్రేయసి/ ప్రియుడిపై కక్ష కట్టడం.. వాళ్లపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ప్రేమికుడు ఏకంగా రైలుకు నిప్పు పెట్టాడు. తనను చంపేయాలని, భూమిపై జీవించే అర్హత లేదని కోర్టును వేడుకున్నాడు. జోకర్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటన జరిగింది జపాన్ లో. క్యోటా హతోరి (26) అనే యువకుడికి ఆరు నెలల క్రితం తన ప్రేయసితో బ్రేకప్ అయింది. దాన్నుంచి కోలుకోకముందే.. ఈ గ్యాప్ లో వేరే వాన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దాంతో మనస్థాపానికి చెందిన క్యోటా హతోరి చనిపోదామని చాటా ట్రై చేశాడు.

కానీ, ధైర్యం చాలకపోవడంతో.. ఓ ప్లాన్ చేశాడు. రైలు ప్యాసింజర్స్ పై దాడికి పాల్పడ్డాడు. ఓ ప్రయాణికుడ్ని కత్తితో పొడవడం సహా.. ఓ బోగీకి నిప్పంటించాడు. దీనివల్ల అతని మరణ శిక్ష పడుతుందని భావించాడు. అక్కడే అతని తప్పు బెడిసి కొట్టింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా.. న్యాయస్థానం 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ‘నాకు మరణ శిక్ష విధించాల’ని కోర్టును ఎంత కోరినా ఫలితం లేకపోయింది. స్వార్థపూరిత ఉద్దేశంతో నేరానికి పాల్పడ్డాడని కోర్టు తీర్పునిచ్చింది.

Tags:    

Similar News