India- Maldives : విభేదాల వేళ.. భారత్కు మాల్దీవ్స్ అధ్యక్షుడు?

Byline :  Bharath
Update: 2024-01-09 14:49 GMT

లక్షద్వీప్, మాల్దీవుల వివాదం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ ను పర్యటించిన తర్వాత.. కొంతమంది మాల్దీవుల నేతలు భారత్ పై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అవికాస్త వివాదాస్పదం అవడంతో.. ఆ నేతలను మాల్దీవ్స్ ప్రభుత్వం పదవుల నుంచి తప్పించింది. కాగా ఈ వ్యాఖ్యలపై భారత సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తుంది. భారత్ తో దైపాక్షక సంబంధాలు బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు.. త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాల్దీవ్స్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన కూడా ఖరారైంది.

జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వారు భారత్ లో పర్యటించనున్నారు. అయితే తాజా విభేదాలకు, ప్రస్తుత పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని, ముందుగానే వీరి పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది. పోయిన ఏడాది యూఏఈలో జరిగిన కాప్ 28 పర్యావరణ సదస్సులో భారత ప్రధానితో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలో వీరి ఢిల్లీ పర్యటన ఫిక్స్ అయింది. కాగా ప్రస్తుతం ముయిజ్జు చైనా పర్యటనలో ఉన్నారు. 




Tags:    

Similar News