16 కోట్ల రోడ్డు.. 3 వారాలకే ధ్వంసం

Update: 2023-06-28 03:36 GMT

ఆ మూరుమూల గ్రామాలకు సరైన రోడ్డు లేదు. ఎట్టకేలకు 3 వారాల క్రితం రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం వారికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే రోడ్డు వేసిన మూడు వారాలకే అది ధ్వంసమైంది. 16కోట్లతో వేసిన రోడ్డు మూడు వారాలకే కోతకు గురవ్వడం గమనార్హం.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని రంగబయలు, జోడిగుమ్మ, కొసంపుట్టు, వనుగుమ్మ తదితర గ్రామాలకు దశాబ్దాలుగా రోడ్డు లేదు. మూడేళ్ల కిందట రోడ్డు కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 16 కోట్లు మంజూరవ్వగా.. ఎట్టకేలకు మూడు వారాల క్రితం రోడ్డు కంప్లీట్ అయ్యింది. దీంతో స్థానిక ప్రజలు సంతోషించారు. తమకు ప్రయాణ తిప్పలు తప్పినట్లేనని భావించారు.

వారి సంతోషం మూడు వారాలకే ఆవిరి అయ్యింది. ఒక్క వానకే 3కి.మీ. మేర రోడ్డు ధ్వంసమైంది. మట్టిగుడ సమీపం నుంచి కొసంపుట్టు మార్గంలో పలుచోట్ల కోతకు గురైంది. పనుల్లో న్యాణ్యతా లోపం వల్లే ఒక్క వానకే రోడ్డు ధ్వంసమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి అధికారులు ధ్వంసమైన రోడ్డును బాగుచేయిస్తారో.. లేక మీనమేషాలు లెక్కిస్తూ కాలం వెల్లదీస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News