ఒంగోలులో అమానవీయం.. గిరిజనుడి నోట్లో మూత్రం పోసి..

Update: 2023-07-19 05:25 GMT

ఏపీలోని ఒంగోలులో అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడిపై పలువురు దుండగులు పైశాచికికంగా ప్రవర్తించారు. అతడిని తీవ్రంగా చికతబాది, నోట్లో మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలు పెట్టారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. ఈ ఘటన నెల రోజుల క్రిత జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ప్రకాశం జిల్లాకు చెందిన మోటా నవీన్ అనే గిరిజన యువకుడు, మన్నె రామాంజనేయులు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ జులాయిగా తిరిగుతూ పలు నేరాలకు పాల్పడుతుండేవారు. పోలీసులు వీరిపై ఇప్పటి వరకు సుమారు 50 చోరీ కేసులు నమోదు చేశారు. ఇందులో నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడి.. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే అంజి మాత్రం పోలీసులకు చిక్కలేదు.

కాగా కొంత కాలం నుంచి వీరద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం అంజి నవీన్ కు కాల్ చేసి.. మందు తాగడానికి ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజ్ వెనక్కి రావాలని ఆహ్వానించాడు. అతడి మాటలు నవీన్ అక్కడి వెళ్లాడు. కానీ అక్కడ అంజితో మరో తొమ్మది యువకులు ఉన్నారు. వారంతా కలిసి మద్యాన్ని సేవించారు. మద్యం తాగుతున్న సమయంలోనే వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

అప్పటికే ప్లాన్ ప్రకారం అక్కడున్న యువకులంతా ఆ గిరిజనుడిపై దాడికి పాల్పడ్డారు. విడిచి పెట్టాలని నవీన్ ఎంతగా ప్రాధేయపడ్డా.. వాళ్లు వినిపించుకోలేదు. క్రూరంగా రక్తం వచ్చేయాలని కొట్టారు. బాధితుడి నోట్లో మూత్రం పోశారు. దానిని తాగాలని ఒత్తిడి చేస్తూ, మళ్లీ కొట్టడం మొదలుపెట్టారు. దీనిని అక్కడున్న పలువురు వీడియో తీశారు.

ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితులపై వారు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే నిందితులు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News