విజయవాడలో కిడ్నాప్ కలకలం రేపింది. భవానీపురానికి చెందిన ఓ బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచరం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే బాలుడిని ఆచూకీ కనుగొని..తల్లి చెంతకు చేర్చారు. ఆర్థిక లావాదేవీలు కారణంగానే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తేల్చారు.
బాలుడు కిడ్నాప్ గురైన ఫిర్యాదు అంతగానే భవానీపురం పోలీసులు అలెర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలు ఆధారంగా నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరికి కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలపాలెం గ్రామ సమీపంలో బాలుడి ఆచూకీ గుర్తించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసు చేధించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన లింగం దేవేంద్ర తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేసినట్టుగా విజయవాడ వెస్ట్‌జోన్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు కిడ్నాప్‌లో పాల్గొన్నారని వివరించారు.