Nandyala District : హాస్టల్‌లో ప్రసవించిన బీటెక్ విద్యార్థిని..ఆస్పత్రిలో మృతి

Update: 2024-01-28 03:39 GMT

నంద్యాల జిల్లా పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విషాద ఘటన జరిగింది. హాస్టల్‌లో ఓ విద్యార్థిని ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిన విద్యార్థిని గర్భిణిగా ఉన్నా గుర్తించకపోవడం, ప్రసవించే వరకు తోటి విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థిని కాలేజీకి రావాలని కోరింది. రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్ బాత్రూములో బిడ్డను ప్రసవించింది. అనంతరం స్పృహ కోల్పోయిన యువతిని కాలేజీ యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News