కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన ఆరోపించారు. ఇక ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ కన్నెర్ర జేసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్-వైసీపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించింది. రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయసాయి రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తోందని కాంగ్రెస్ నేత కాల్వ సుజాత ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన రేవంత్ సర్కార్ రు ఏమిచేయలేవని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని మండిపడ్డారు. కాగా సోమవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. ఆ పార్టీ చేసిన పనికి తెలంగాణలోనూ 10ఏళ్లు అధికారం దక్కలేదని అన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరన్నారు.
ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారని, పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు వైసీపీ ఎంపీ . ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించిందని , అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ అని అన్నారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తధ్యమని అన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ని నమ్మట్లేదన్నారు.