విశాఖలో విషాదం..నీటి సంపులో పడి కుటుంబం ఆత్మహత్య

Update: 2023-08-09 04:46 GMT

విశాఖపట్నంలో విషాదకరమైన సంఘటన జరిగింది. జిల్లాలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్‎లోని ఓ అపార్ట్‎మెంట్‎లోని నీటి సంపులో ఓ తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు బుధవారం లభించాయి. మృతుల్లో తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా గుర్తించారు. చనిపోయిన వారు అపార్ట్‎మెంట్‎ వాచ్‎మెన్‎గా కుటుంబంగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

పది నెలల క్రితం ఈ కుటుంబం విశాఖకు వచ్చింది. ఇంతలోనే ఇంత ఘోరం జరగడంతో అక్కడున్నవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకున్నారు. మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి డెడ్ బాడీస్‏ను పోస్ట్‎మార్టం నిమిత్తం హాస్పిటల్‎కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Tags:    

Similar News