Doctor Jayaram Naidu : తెలుగు వైధ్యుడికి అరుదైన గౌరవం.. అమెరికా వీధికి ఆయన పేరు

Byline :  Bharath
Update: 2024-01-15 01:48 GMT

తెలుగు వైధ్యుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. వైద్య వృత్తిలో ఆయన చేసిన కృషికి, విశేష సేవలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం.. ఓ వీధికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఆయన పేరే బావికాటి జయరాం నాయుడు. అమెరికాలో స్థిరపడ్డారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లికి చెందిన ఆయన.. ప్రస్తుతం టెక్సాస్ లో స్థిరపడ్డారు. 1968లో అమెరికా వెళ్లిన ఆయన.. కార్డియాలజీ విభాగంలో నిపుణుడిగా ఖ్యాతి గడించారు. అంతేకాకుండా అక్కడ గుండె సంబంధిత రోగుల కోసం 300 పడకగ హాస్పిటల్ ను నిర్మించారు. ఇందుకుగానూ జయరాంను టెక్సాస్ మెడికల్ బోర్డ్ సభ్యుడిగా నియమించింది.




 


ఎంత ఎత్తుకెదిగినా సొంత ఊరిని మరొవొద్దన్నట్లు.. జయరాం తన సొంత ఊరు పెద్దకొట్టాలపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటుచేశారు. 1997లో రూ.20 లక్షలతో హాస్పిటల్ కట్టించారు. 2015లో కంప్యూటర్ ల్యాబ్, ప్రతీ ఏట పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.30 వేల నగదు.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీ మొత్తంలో ఆర్తిక సాయం అందిస్తున్నారు.




Tags:    

Similar News