ఆట మధ్యలోనే ఆవిరైన ప్రాణం.. నంద్యాలలో..

Update: 2023-08-14 02:59 GMT

గుండెపోటు... ఈ మధ్య అందరినీ కలవరపెడుతున్న అంశం. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రాణాలను కబళిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది గుండెపోటుతో సడెన్గా ప్రాణాలు వదిలారు. జిమ్ చేస్తుండగా.. వాకింగ్ చేస్తుండగా.. ఆటలు ఆడుతుండగానే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఫిట్గా ఉన్నా లేకున్నా గుండెపోటు అనేది కామన్గా మారింది.

తాజాగా ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్లో మహేంద్ర అనే యువకుడు ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆట మధ్యలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించినట్ల వైద్యులు తెలిపారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఇటీవలె విజయనగరం జిల్లాలో ఓ యువకుడు వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురైంది. ఇంతకుముందు హీరో తారకరత్న, మాజీమంత్రి మేకపాటి గౌతమ్ లాంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News