రాష్ట్ర వ్యాప్తంగా నేడు స్కూళ్లు బంద్

Update: 2023-07-05 02:15 GMT

ప్రైవేట్ స్కూల్స్ పేరిట నిలువు దోపిడి జరుగుతోంది. పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తామనే మాటలు చెప్తూ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అందుకే ఏబీవీపీ.. రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అధిక ఫీజుల దోపిడి చేస్తూ.. తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నాయని, ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను.. డీఎస్సీ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలల బంద్ ను విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.





 


Tags:    

Similar News