Breaking News : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. జైల్లోనే..

By :  Krishna
Update: 2023-09-22 09:42 GMT

స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడికి ఏసీబీ కోర్టు అనుమతించింది. 2రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగగా.. సీఐడీ లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 2రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

ఇక చంద్రబాబును ఎక్కడ విచారిస్తారని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజమండ్రి జైలులోనే చంద్రబాబును విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. అయితే కస్టడీ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. అటు హైకోర్టులోనూ చంద్రబాబుకు ఊరట దక్కలేదు. ఈ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంలో సవాల్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News