Skill development scam case : మధ్యాహ్నం 3గంటలకు తీర్పు..?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఏసీబీ కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. అరెస్టుకు సంబంధించి సీఐడీ ఇప్పటికే వాదనలు పూర్తి చేయగా.. టీడీపీ అధినేత తరఫున ప్రముఖ అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు భోజన విరామం ఇచ్చింది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ధర్మానసం మరోసారి ఇరుపక్షాల వాదనలు విననుంది.
ఏసీబీ కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, నేతల్లో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తైన అనంతరం న్యాయమూర్తి మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు ఇచ్చే అవకాశముంది. చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించడంతో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.