బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

Byline :  Veerendra Prasad
Update: 2023-09-03 04:26 GMT

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కోట్టడంతో ఏకంగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున సంతమగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి స్థానికులిచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జు నుజ్జైన ఆటోలోంచి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. ఇక చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు.

మరో ముగ్గురు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా మృతులు నరసరావుపేటకి చెందిన కేటరింగ్ సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. వినుకొండ నుండి నరసరావుపేట వెళ్తుండగా ఈ దర్ఘటన చోటుచేసుకుంది. మృతుల పేర్లు, వివరాలు తెలుసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పొరపాటు వల్లే యాక్సిడెంట్ జరిగినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. గుంటూరు , కర్నూలు రహదారిలో సంతమాగులూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News