వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుంటే.. 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతుంది..?: నటుడు పృథ్వీ

Byline :  Bharath
Update: 2023-12-24 12:26 GMT

వైసీపీ ప్రభుత్వంపై నటుడు పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ కు పనికొస్తారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో వైసీపీతో ప్రయాణం చేసిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఆడియో టేప్ కలకలం తర్వాత.. తన పదవిని పోగొట్టుకుని పార్టీకి దూరం అయ్యారు. చాలాకాలంటా రాజకీయాలను దూరంగా ఉన్న పృథ్వీ.. జనసేన పార్టీలో చేరతారంటే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తానంటుంది. నిజంగా అన్ని స్థానాల్లో గెలుస్తుందనుకుంటే.. 92 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చిందని పృథ్వీ ప్రశ్నించారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని జోస్యం చెప్పారు. 135 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ - జనసేన కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కుటుంబ పాలన ముగిసిందని తెలిపారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో కూడా సుపరిపాలన ప్రారంభం అవుతుందని పృథ్వీ చెప్పుకొచ్చారు.  

Tags:    

Similar News