చంద్రబాబు తరుపున వాదించనున్న ప్రముఖ అడ్వకేట్

By :  Krishna
Update: 2023-09-09 11:19 GMT

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రమంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కాసేపట్లో ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బాబు తరుపున వాదించేందుకు ప్రముఖ అడ్వకేట్ ను టీడీపీ రంగంలోకి దించింది. సుప్రీం సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా బాబు తరుపున వాదించనున్నారు.

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వివేకానంద మర్డర్ కేసులో వైఎస్ సునీత తరుఫున సిద్ధార్థ్ లూథ్రానే వాదనలు వినిపించారు. చంద్రబాబుపై ఇతర కేసుల్లోనూ ఆయనే వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఆయన్ను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా పిలిపిచ్చింది. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా బాబుకు బెయిల్ లభిస్తుందా.. రిమాండ్‌కు వెళ్తారా.. సీఐడీ కస్టడీకి తీసుకుంటుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News