siddharth luthra : చంద్రబాబును కలిసిన అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా..
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టై చంద్రబాబును ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. రాజమహేంద్రవరం జైలుకు వెళ్లిన ఆయన బాబుతో ములాఖత్ అయ్యారు. లూథ్రా దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు. కోర్టులో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించినట్లు సమాచారం. జైలులో ములాఖత్ అనంతరం సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో మాట్లాడిన అంశాలతో పాటు న్యాయపరమైన విషయాలపై వారితో చర్చించినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే అడ్వొకేట్ సిద్దార్థ లూథ్రా తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అందరూ అలసి పోయిన తర్వాత, కనుచూపు మేరలో న్యాయం కనిపించకపోతే.. కత్తి పట్టడమే సరైనది. ఇక పోరాటం చేయడమే సరైన చర్య' అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు గురుగోబింద్ సింగ్ చెప్పిన మాటలను లూథ్రా రీట్వీట్ చేశారు. పేరున్న అడ్వకేట్ చివరకు కత్తి పట్టమని సలహా ఇస్తూ ట్వీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.