వైసీపీ వల్ల అన్ని వర్గాలు నలిగిపోయాయి..కొత్త పథకాలు తెస్తానన్న బాబు

Byline :  Shabarish
Update: 2024-03-13 09:48 GMT

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నలిగిపోయాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 'కలలకు రెక్కలు' కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే 'మహాశక్తి' కింద ఐదు కార్యక్రమాలను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.

టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలను తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకురావడానికి కారణం ఎన్టీఆర్ అని, ఒకప్పుడు ఐటీ అంటే ఎవ్వరూ వినలేదని, కానీ ఇప్పుడు తాను తీసుకొచ్చిన ఐటీ రంగంలో ప్రపంచమంతా మనవాళ్లు ఉన్నారన్నారు. ఆడబిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ టీడీపీ అని, వారి నైపుణ్యాభివృద్ధి కోసం వారికి ఎంతైనా ఖర్చు పెట్టే పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు గెలవాలి అంటే రాష్ట్రం నిలబడాలి అని, అందుకు 202 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాలని అన్నారు. సీఎం జగన్‌ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థా సక్రమంగా లేదన్నారు. రైతులు, యువత, కార్మికులు నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలు నలిగిపోయాయన్నారు. అమరావతి అభివృద్ధి చెంది, పోలవరం పూర్తయి ఉంటే ఈపాటికే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఎక్కడో ఉండేవాళ్లమన్నారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News