ఆమంచి కృష్ణమోహన్‌‌కు పాముకాటు..వైసీపీ వర్గాల్లో ఆందోళన

Update: 2023-07-17 15:33 GMT

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పాము కాటు వేసింది. వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఆయన పాము కాటుకు గురయ్యారు. వెంటనే ఆమంచిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమంచి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాటు వేసిన పాము విషపూరితమైనదా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఆమంచి పాముకాటుకు గురయ్యారన్న వార్తతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆమంచిని పరామర్శించేందుకు కీలక నేతలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.


Tags:    

Similar News