Ambati Rambabu : చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దులు.. పవన్పై అంబటి సెటైర్లు
Byline : Bharath
Update: 2024-01-15 07:27 GMT
ఆంధ్రప్రదేశ్ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మరోసారి సెటైర్లు వేశారు. ఏపీ ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటుటే.. ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. పండగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. తర్వాత గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటోలు దిగారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన అంబటి.. చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దు ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాలంటూ చీవాట్లు పెడుతున్నారు.