Ambati Rayudu : వైఎస్ఆర్సీపీకి భారీ షాక్.. ఆ పార్టీకీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్‌బై
Byline : saichand
Update: 2024-01-06 05:59 GMT
వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని పోస్ట్ చేశారు. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన అంబటి రాయుడు కొన్ని రోజులకే రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.