ఏపీలో ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుటుందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కీలక వాఖ్యలు చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయని స్పష్టం చేశారు. శనివారం (ఫిబ్రవరి 10) ఎకనామిక టైమ్స్ సదస్సులో మాట్లాడిన అమిత్ షా ఏపీ పొత్తులపై ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. అయితే త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం ఆ సందర్భంగా ఓ క్లారిటీ ఇచ్చారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బావుంటుంది.. కానీ రాజకీయాల్లో ఎంత పెద్ద కూటమి ఉంటే అంత భలమని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ కూటమిలోమి మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వాళ్లు బయటకు వెళ్లారని షా అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీతో చర్చలు నడుస్తాయన్నారు. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీల పొత్తులు, టికెట్ల పంపకాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఈ భేటీ ముగించుకుని హైదరాబాద్ కు రాగానే.. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీట్ల కేటాయింపులపై చర్చించినట్టు సమాచారం. శుక్రవారం (ఫిబ్రవరి 9) టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి విందు ఇవ్వడంతో పాటు.. ఇవాళ పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమితో పొత్తుపెట్టుకునే పార్టీ ఏదవుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.