Amit Shah : ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Update: 2024-02-11 03:50 GMT

ఎన్నికల వేళ ఏపీలో పోత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు.ఇప్పుడే ఏమి మాట్లాడలేమని ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు కూటమిలోని మిత్రులను మేమెప్పుబడు బయటకు పంపాలేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను బట్టి వారే బయటకు వెళ్లారు అని అమిత్ షా పేర్కొన్నారు. ఇటీవల షాతో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ, అకాలీదళ్, శివసేన పార్టీలు గతంలో బయటకు వచ్చేశాయి. 2014 ఏపీ శాసనసభ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. 2019 లో ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీచేశాయి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా.. 2014లో మాదిరిగానే మూడుపార్టీలు జతకడతాయా.. అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఢిల్లీలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. దీంతో ఏపీ పాలిటిక్స్ కాస్తా ఓవర్ టు ఢిల్లీగా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లున్నట్లు సమాచారం. పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తులు కొలిక్కి వస్తాయని అమిత్ షా కామెంట్స్ చేసిన నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం ఏర్పడింది.

Tags:    

Similar News