DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. షెడ్యూల్ ఇదే..?

Byline :  Kiran
Update: 2024-02-12 08:34 GMT

నిరుద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈసారి డీఎస్సీలో 6,100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

పోస్టులవారీగా ఖాళీల వివరాలు

ఎస్జీటీ - 2299

స్కూల్ అసిస్టెంట్ - 2280

టీజీటీలు - 1,264

పీజీటీలు - 215

ప్రిన్సిపల్స్‌ - 42

అర్హులైన అభ్యర్థులు ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 22వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 122 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9. 30 నుంచి మ. 12గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సా. 5 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

డీఎస్సీ పరీక్షకు సంబంధించి మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న అభ్యంతరాల స్వీకరించి ఏప్రిల్ 2న ఫైనల్ కీ ప్రకటించనున్నారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెలువడనున్నాయి. 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించనున్నట్లు బొత్స ప్రకటించారు. ఇక అభ్యర్థుల వయో పరిమితి విషయానికొస్తే.. జనరల్ కేటగిరి అభ్యర్థుల గరిష్ఠ వయసు 44 ఏండ్లుగా నిర్థారించారు. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు 5ఏండ్లు మినహాయింపు ఇచ్చారు. 




Tags:    

Similar News