ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

Update: 2023-06-14 06:17 GMT

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇంజనీరింగ్ లో 76.32, అగ్రికల్చర్ లో 89.65శాతం మంది అర్హత సాధించారు. వారిలో 2,24,724 మంది ఇంజనీరింగ్ పరీక్ష రాయగా వారిలో 1,71,514 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంగా 90,573 మంది ఎగ్జామ్ రాయగా.. 81,203 మంది క్వాలిఫై అయ్యారు.

త నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికిగాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికిగాను 90,573 మంది ఎగ్జామ్ రాశారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఉన్నత విద్యామండలి 25 శాతం వెయిటేజీ ఇచ్చింది. దీంతో ఇంటర్మీడియెట్‌ వెయిటేజ్‌ మార్కులను పరిగణలోకి తీసుకుని కాస్త ఆలస్యంగా ఫలితాలు ప్రకటించారు. 

Tags:    

Similar News