కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..

Update: 2023-06-05 15:34 GMT

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు అంగీకరం తెలిపింది. బుధవారం జరగబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించి కీలక ప్రకటన చేయనున్నారు. 2014 జూన్ 2వ తేదీ నాటికి అయిదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. అదే విధంగా కేబినెట్ భేటీ అనంతరం పీర్సీపై ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. 12వ వేతన సవరణ సంఘంపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి.


Tags:    

Similar News