టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ తదితర స్కాంలలో ఆయనపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం మరిన్ని పాత విషయాలు తవ్వి తీస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక విధానంలో భారీ అవకతవకలు జరిగాయనూంట సీఐడీ గురువారం కేసు పెట్టింది.
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడంతో బాబుతోపాటు మరికొంతమంది పచ్చపార్టీ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. వీరిలో పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి. వీరు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచారు వెంకటరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ప్రభుత్వం మద్యానికి సంబంధించి కేసు పెట్టడం తెలిసిందే. బాబు హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. పీసీ యాక్ట్ కింద నమోదైన ఈ కేసులో ఆయన మూడో నిందితుడిగా చేర్చింది.