CM Jagan : జనవరి 22 వరకు డెడ్లైన్.. లేదంటే సమ్మేకు దిగుతాం
Byline : Bharath
Update: 2024-01-08 12:54 GMT
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సిబ్బంది సమ్మె బాట పట్టారు. జనవరి 22లోపు తమ సమస్యలు తీర్చకపోతే.. జనవరి 23 నుంచి సమ్మేకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మే నోటీసులను ఏపీ ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హరేంద్ర ప్రసాద్ కు అందించారు. మొత్తం 7వేల మంది 108,104, తల్లీబిడ్డ విభాగాల్లో పనిచేస్తున్నారని హరేంద్ర ప్రసాద్ కు ఇచ్చిన నోటీసుల్లో చెప్పారు.
ఈ సందర్భంగా ఈఎంటీ పోస్టుల భర్తీలో తమకు వెయిటేజీ కల్పించాలని కోరారు. సమస్యలు తీర్చకపోతే.. నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కాగా, ఏపీలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.