BJP : మా వ్యూహం అదే.. టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై బీజేపీ

By :  Krishna
author icon
Update: 2024-02-25 11:38 GMT
BJP : మా వ్యూహం అదే.. టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై బీజేపీ
  • whatsapp icon

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో మొదటి జాబితాను ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. టీడీపీ 94, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు తర్వాత మిగితా సీట్లను కన్ఫార్మ్ చేస్తామని చంద్రబాబు, పవన్ ప్రకటించారు. ఇక ఈ పొత్తుపై బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరీ స్పందించారు. పొత్తులకు సంబంధించి పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.

తమ ప్రణాళిక తమకు ఉన్నట్లు పురంధేశ్వరీ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలతో హైకమాండ్ పొత్తు కన్ఫార్మ్ చేస్తే అప్పుడు సీట్ల గురించి ఆలోచిస్తామన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేదానిపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు 175 స్థానాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. కాగా టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అటు పవన్ కల్యాణ్ సైతం బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పొత్తుకు ఒప్పించినట్లు తెలిపారు. మరోవైపు సీట్ల పంపకాలపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. 

Tags:    

Similar News