స్కిల్ స్కాం.. చంద్రబాబు 13చోట్ల సంతకాలు పెట్టారు: సీఐడీ చీఫ్

Update: 2023-09-13 15:58 GMT

కేబినెట్ అనుమతి లేకుండానే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. కేవలం జీవో ద్వారా ఈ కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. జీవోల్లో పదమూడుచోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నట్లు తెలిపారు. నిధులు విడుదల చేయాలని, చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించాలని, డీప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలో, కేబినెట్ సమావేశం మినట్స్‌లో... ఇలా అన్నింటా చంద్రబాబు సంతకం ఉందని తెలిపారు.




 


సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంవోయూలో లేదని సంజయ్ చెప్పారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు కీలక బాధ్యతలు అప్పజెప్పారన్నారు. టీడీపీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆడిటర్‌ను కార్పొరేషన్‌కు ఆడిటర్‌గా నియమించారన్నారు. ఈ కార్పొరేషన్ నుంచి రూ.241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు వెళ్లాయని అన్నారు. ఈ స్కాంపై జర్మనీలోని సీమెన్స్‌ యాజమాన్యం కూడా స్పందించిందన్న సీఐడీ చీఫ్.. భారత్‌లోని తమ ఉద్యోగులు తమకు వాస్తవాలు చెప్పకుండా దాచినట్లు సీమెన్స్ తెలిపిందన్నారు.

మరోవైపు చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు నిరాకరించింది. వచ్చే సోమవారం వరకు బాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. 


Tags:    

Similar News