Breaking News: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్కు షాక్.. అరెస్ట్ తప్పదా..?

By :  Kiran
Update: 2023-09-26 08:09 GMT

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేర్చింది. (AP CID May Nara lokesh )ఈ మేరకు ఈ మేరకు సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా చేర్చింది.

"ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని సీఐడీ అభియోగాలు మోపింది". (Inner Ring Road Alignment Case ) ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్‌ పేరును మెన్షన్‌ చేసింది. అంతకు ముందు క్విడ్‌ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారని లోకేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయనను బెయిల్ పై బయటకు రప్పించేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలోనే మకాం వేసి లాయర్లతో టచ్ లో ఉంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీఐడీ అధికారులు లోకేష్ను సైతం అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ నేతల భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మార్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పన, ఆమోదంలో చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్‌, నారా లోకేష్‌, మరికొందరు వారి భూములకు భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో దర్యాప్తు సంస్థ చంద్రబాబును A1 నిందితుడిగా చేర్చింది.

Tags:    

Similar News