నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్లో ఉద్యోగాలు..
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 275 ఖాళీలు, హెల్పర్ 275 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 275 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు నెలల కాలానికి ఈ నియామకం చేపట్టనున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం సేకరించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ(అగ్రికల్చర్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్), డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పోస్టును బట్టి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు సెప్టెంబర్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పంపాలి. అప్లికేషన్ను నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కు రిజిస్టర్ పోస్టులో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక మార్కులు, ఎక్స్పీరియన్స్ అధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eastgodavari.ap.gov.in/ ను చూడొచ్చు.