ఇక ఏం చేద్దాం... జగన్ సమావేశాలు.. రేపు ఢిల్లీకి!

Byline :  Lenin
Update: 2023-09-12 09:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. లండన్ నుంచి ఈ రోజు(మంగళవారం) ఉదయం రాష్ట్రానికి చేరుకున్న ఆయన వచ్చీరాగానే చంద్రబాబు అరెస్ట్, కేసు వివరాలను ప్రభుత్వ నాయ్యవాది పొన్నవోలు సుధాకర్ ద్వారా తెలుసుకున్నారు. ఆయనను క్యాంపు కార్యాలయానికి పిలిపించుని తదుపరి కార్యాచరణపై మాట్లాడారు. భేటీలో వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితర వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రల పరిస్థితిని సీఎం సమీక్షించారు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా అన్ని విభాగాలను సమన్వయం చేసుకున పనిచేయాలని ఆదేశించారు.

బాబు అరెస్ట్, త్వరలో ఎన్నికల నేపథ్యంలో జగన్ రేపు (బుధవారం) ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాలను ఆయన కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలు సహా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు జగన్‌ను కేంద్ర ప్రభుత్వం పెద్దలు హస్తినకు పిలించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News