వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష..ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు

By :  Kalyan
Update: 2023-07-28 10:19 GMT

ఆంధ్రప్రదేశ్‎లో కురుస్తున్న వర్షాలు, వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పర్యటించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ముంపు ప్రాంతాలను, పంట పొలాలను సందర్శించాలన్నారు. బాధితులకు అండగా నిలవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోని చాలా వరకు జలాశయాలను వరద నీరు ముంచెత్తుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదలపైన సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో అధికారులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు అండగా నిలవాలంటూ సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు , వారి అవసరాలను తీర్చాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News