YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ జోస్యం

Byline :  Krishna
Update: 2023-12-15 10:45 GMT

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై (YS Jagan Mohan Reddy)   సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రులతో వ్యాఖ్యానించారు. గతం కంటే 20రోజుల ముందుగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి కావాలని వారికి సూచించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని.. అయినా మంత్రులు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థల విష ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం సూచించారు.  

 


Tags:    

Similar News