డీఎస్సీ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చంటే..

By :  Kiran
Update: 2024-02-21 11:39 GMT

ఆంధ్ర ప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్ష దరఖాస్తు గడువు పొడగించారు. నోటిఫికేషన్‌లో ప్రకారం నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 25 రాత్రి 12గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించడంతో పాటు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష..టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

ఎడిట్‌ ఆప్షన్‌

డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల్ని సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకొని మళ్లీ సబ్మిట్ చేయవచ్చని చెప్పింది. అప్లికేషన్ ఎడిట్‌ చేసుకునేందుకు అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్లో లాగిన్ అయి పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలను మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ ఉంటే ఎగ్జామ్ సెంటర్లో నామినల్స్‌ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో దాన్ని సరిదిద్దుకోవచ్చు.

ఏపీలో మొత్తం 6,100 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఏప్రిల్‌ 7న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

మరోవైపు ఏపీ టెట్‌ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వరకు జరగనుంది. టెట్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పక్కనున్న రాష్ట్రాల్లోనూ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే సమయంలో అలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు.


Tags:    

Similar News