ఏపీ ఎంసెట్ రిజల్ట్స్‌ విడుదలకు ముహూర్తం ఖరారు

Update: 2023-06-10 16:12 GMT

ఏపీ ఎంసెట్ లేదా ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న ఫలితాలను చేయనున్నట్లు ఈఏపీసెట్ ఛైర్మన్ రంగ జానార్ధన ప్రకటించారు. జూన్ 14న విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు cets.apsche.ap.gov.in ద్వారా ఫలితాలను చూడొచ్చు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌,ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు.

ఇటీవల ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ఎగ్జామ్కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్‌లో సాధించిన మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. 

Tags:    

Similar News