దళితుల భూముల్లో జగనన్న కాలనీలు!

Update: 2023-06-09 12:46 GMT

ప్రజాకర్షణ పథకాలతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం అత్యుత్సాహంతో చేయకూడని పనులు చేస్తోంది. అధికారులు నిరుపేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే సత్సంకల్పంతో కొందరిని ఉన్న భూములను దూరం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను జగనన్న కాలనీలకు, గ్రామ సచివాలయాలకు అంటూ ఏవేవో పేర్లు చెప్పి లాక్కుంటున్నారని బాధితులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల మరో రకం సమస్యలు ఎదురవుతున్నాయి. కుంటల్లో, గుంటల్లో కడుతున్న జగనన్న కాలనీల్లోని తగ్గు ప్రదేశాలను పూడ్చడానికి తమ పొలాల పక్కన ఉన్న మట్టిని ఎత్తుకుపోతున్నారని, దీంతో తమ భూములకు ముప్పు వాటిల్లుతోందని, ఏటిగట్లు కోతకు గురవుతున్నాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల ఉద్దేశం మంచిదే అయినా విలువైన ప్రభుత్వ స్థలాల్లో కాకుండా చెరువుల్లో, కుంటల్లో, నివాస స్థలాలకు పది, ఇరవై కిలోమీటర్ల మారుమూల ప్రాంతాల్లో ఇస్తున్నారని లబ్దిదారులు కూడా వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యలు కనిపిస్తున్నాయి.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం కోర్టు వివాదాల్లో ఉన్న దళితుల భూమిని సైతం సేకరించారు. దీనిపై బాధితులు కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు అనుమతులు లేకుండా భూములు చదులు చేసి, బోర్లు వేస్తున్నారని, ఆ స్థలాలు వేరొకరి పేరుతో బదిలీ అయితే రేపే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా ఫలితమేమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రెవిన్యూ కాలనీ కోసం రామచంద్రయ్య వికలాంగుడికి చెందిన మూడెకరాల భూమి ప్రభుత్వం కబ్జా చేసిందని ఆరోపణలు వస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి జగతిమెట్ట సమీపంలో శ్యామసుందరాపురంలో మరో వింత సమస్యేఎదురైంది. జగనన్న కాలనీలో తనకు కేటాయించిన భూమిని కబ్జా చేసి, ఇల్లు కడుతున్నారని నాగవంశం బాలమ్మ అనే దళితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరుగులంకలో జగనన్న కాలనీలను తగ్గు ప్రదేశంలో నిర్మిస్తున్నారు. అక్కడి గుంతలను పూడ్చడానికి తమ భూముల దగ్గర్నుంచి మట్టి తీసుకెళ్తున్నారని దళితు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AP government alleged encroaching of Dalits and poor people lands for jagananna colonies

AP government , AP govt encroaching, Dalits and poor people lands, jagananna colonies, Andhra Pradesh

Tags:    

Similar News